Government Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 342 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
AAI Recruitment 2023 :
- జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - 9
- సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 9
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) - 237
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) - 66
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్) - 3
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) - 18
విద్యార్హతలు
AAI Eligibility criteria 2023 :
- జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - డిగ్రీ చేసి ఉండాలి. బీకామ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) - డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) - బీకామ్ చేసి ఉండాలి. అలాగే రెండేళ్ల వ్యవధి గల ఐసీడబ్లూఏ/ సీఏ/ ఎంబీఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్) - బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఫైర్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) - 3 ఏళ్ల వ్యవధి గల 'లా' డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి
AAI Age Limit :
- సీనియర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 4 నాటికి 30 ఏళ్ల మించి ఉండకూడదు.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 4 నాటికి 27 ఏళ్లు మించి ఉండరాదు.
నోట్ :ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.