AAI Apprentices Jobs 2023 : మినీరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా' 185 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఉద్యోగాల వివరాలు
- గ్రాడ్యుయేట్ (డిగ్రీ) అప్రెంటీస్ - 22 పోస్టులు
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్ - 90 పోస్టులు
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ - 73 పోస్టులు
- మొత్తం పోస్టులు - 185
విభాగాలవారీగా ఉద్యోగాలు
- సివిల్ - 32 పోస్టులు
- ఎలక్ట్రికల్ - 25 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ - 29 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 7 పోస్టులు
- ఏరోనాటికల్ - 2 పోస్టులు
- ఏరోనాటిక్స్ - 4 పోస్టులు
- ఆర్కిటెక్చర్ - 3 పోస్టులు
- మెకానికల్/ ఆటోమొబైల్ - 5 పోస్టులు
- కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 70 పోస్టులు
- మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ - 2 పోస్టులు
- డేటా అనలిస్ట్ - 3 పోస్టులు
- స్టెనో (ఐటీఐ) - 3 పోస్టులు
విద్యార్హతలు
AAI Apprentice Qualifications :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
AAI Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
AAI Apprentice Fee :ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.