తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల క్రితం తప్పిపోయిన మూగ బాలుడు.. ఆధార్​తో తల్లి చెంతకు.. - Aadhar mother and child

Aadhar reunites mother and child: ఆ యువకుడు తల్లితో మార్కెట్​కు వెళ్లి తప్పిపోయాడు.. తెలియకుండానే వందల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు.. కట్ చేస్తే ఆరేళ్లు గడిచిపోయాయి... తల్లి, కొడుకు మళ్లీ కలిశారు. అదీ ఆధార్ కార్డు సాయంతో.. అదెలాగంటే...?

Aadhar reunites mother and child
Aadhar reunites mother and child

By

Published : Mar 12, 2022, 9:08 PM IST

Updated : Mar 13, 2022, 10:40 AM IST

Aadhar reunites mother and child: ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువకుడిని తల్లి చెంతకు చేర్చింది ఆధార్ కార్డు. మూగవాడైన యువకుడిని కనిపెట్టడంలో సాయపడింది.

కుమారుడిని హత్తుకొని ఏడుస్తున్న తల్లి

mother and child reunite after 6 years:

యెలహంక తాలుకా సింగనాయకనహళ్లికి చెందిన పార్వతమ్మ.. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేది. 2016లో తన కొడుకు భరత్​ను వెంట తీసుకొని కూరగాయలు అమ్మేందుకు బయటకు వెళ్లింది. అప్పుడు భరత్​కు 13 ఏళ్లు. స్నాక్స్ కొనుక్కునేందుకు తల్లి దగ్గరి నుంచి రూ.20 తీసుకొని వెళ్లిన భరత్... తిరిగి రాలేదు. కొడుకు కోసం పార్వతమ్మ చుట్టుపక్కల చూసినా... ఎక్కడా కనిపించలేదు. యెలహంక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేసి.. ఆరేళ్లుగా ఎదురుచూపులతోనే కాలం గడిపింది ఆ తల్లి.

Aadhar reunites mother and child

రైల్వే స్టేషన్​ టు నాగ్​పుర్

స్నాక్స్ కోసం వెళ్లిన భరత్.. మొదట యెలహంక రైల్వే స్టేషన్​కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో మహారాష్ట్రలోని నాగ్​పుర్​కు వెళ్లాడు. 10నెలలు నాగ్​పుర్ స్టేషన్​లోనే గడిపాడు. దిక్కుతోచక తిరుగుతున్న అతడిని రైల్వేస్టేషన్ అధికారులు గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రం అధికారులు భరత్ తల్లిదండ్రులు ఎవరోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, యువకుడు మూగవాడు కావడం వల్ల ఎలాంటి వివరాలు తెలియలేదు.

పునరావాస కేంద్రం సిబ్బందితో

ఆధార్ సెంటర్​తో..

2020లో అధికారులు భరత్​ను ఆధార్ సర్వీస్ సెంటర్​కు తీసుకెళ్లారు. కొత్త ఆధార్ కార్డు నమోదు కోసం ప్రయత్నించగా.. భరత్​ పేరిట అప్పటికే ఆధార్ జారీ అయిన విషయాన్ని గుర్తించారు. అధికారులు ఆరా తీయగా.. బెంగళూరు అడ్రెస్​తో భరత్​కు ఆధార్ కార్డు ఉందని తేలింది. భరత్ తల్లి పార్వతమ్మ మొబైల్ నంబర్ సైతం దొరికింది.

శిశు సంక్షేమ శాఖ అధికారులతో

దీంతో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇచ్చారు. వీరు పోలీసులను సంప్రదించగా.. యెలహంకలో మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యెలహంక పోలీసులు వెంటనే పార్వతమ్మను సంప్రదించి.. వీడియో కాల్ ద్వారా భరత్​తో మాట్లాడించారు. ఆరేళ్ల తర్వాత కొడుకును చూసేసరికి తల్లి కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కొడుకు సైతం తన తల్లిని చూసి బోరున విలపించాడు. మార్చి 7న పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నాగ్​పుర్​కు వెళ్లింది. కొడుకును ప్రత్యక్షంగా చూసి గట్టిగా హత్తుకుంది.

ఇదీ చదవండి:ల్యాండింగ్​లో అపశృతి.. రన్​వే పైనుంచి పక్కకు జరిగిన విమానం

Last Updated : Mar 13, 2022, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details