Aadhar Card Free Update Date Extended 2023 : దేశంలో ప్రతి ఒక్కరికీ.. ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ఇది తప్పనిసరి అయింది. ఒక వ్యక్తికి ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ముఖ్యమైందిగా మారిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు ఆధార్ కార్డ్‌లో చిన్న తప్పులు ఉన్న కూడా మొదటికే మోసం వస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరఖాస్తు మొదలు చాలా పనులకు ఇబ్బందిగా మారుతోంది.
Aadhar Free Update Date Extended 2023 : దీంతో.. ఆధార్ కార్డ్‌లోమీరే స్వయంగా ఆన్‌లైన్‌లో చిరునామా, పుట్టినతేదీ, మొబైల్ నెంబర్‌ను ఉచితంగా మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ సౌకర్యం గతంలోనే కల్పించింది. అయితే.. ప్రజా అవసరాల దృష్ట్యా ఈ గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజా పెంపు ప్రకారం.. డిసెంబర్ 14వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఆ లోపు ఎవరైనా ఉచితంగా ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే.. ఆధార్ కార్డ్‌లో రెటీనా స్కాన్‌లు, వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్, బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవడానికి.. మీ దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ కార్డ్‌లోని ఫొటోను మార్చడానికి ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్చడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
Aadhar Card Update Free :ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో చిరునామాను మార్చడం ఎలా:
- అధికారిక పోర్టల్ uidai.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- మై ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కిందికి స్కోల్ చేసి అప్‌డేట్ యువర్ ఆధార్ ఆప్షన్‌ను టాప్ చేయండి.
- ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌పైక్లిక్ చేయండి.
- ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీకు ఒక ఓటీపీ (OTP) వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మీరు ఏ సమాచారాన్ని మార్చాలనుకుంటున్నారో.. ఆ ఆప్షన్‌పైన క్లిక్ చేసి, దానికి సంభందించిన డాక్యుమెంట్‌లను సబ్‌మిట్ చేయండి.
- డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసిన తరవాత, సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇలా చేయగానే మీ ఆధార్ కార్డ్ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌కు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN), SMS రూపంలో వస్తుంది. దీని వల్ల మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.