తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆధార్​ కార్డులోని పేరు తెచ్చిన చిక్కు.. స్కూల్​ అడ్మిషన్​ తిరస్కరణ! - ఆధార్​ పేరు కారణంగా అడ్మిషన్​ తిరస్కరణ

Aadhar card: ఆధార్​ కార్డులోని పేరు కారణంగా ఓ బాలికకు పాఠశాలలో అడ్మిషన్​ రాలేదు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ జిల్లాలో శనివారం జరిగింది. ప్రస్తుతం ఆ కార్డు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకి ఆ ఆధార్​లో ఉన్న పేరు ఏమిటంటే..?

Aadhar card
ఆధార్​ కార్డు

By

Published : Apr 4, 2022, 3:18 PM IST

Aadhar card: ఆధార్​ కార్డులో ఫొటో అసలు గుర్తు పట్టలేనంతగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మరొకరి ఫొటో వచ్చిన సందర్భాలు చూశాం. అయితే.. వింత పేరుతో ఉన్న ఓ చిన్నారి ఆధార్​ కార్డు ప్రస్తుతం వైరల్​గా మారింది. ఆ పేరు కారణంగా పాఠశాలలో అడ్మిషన్​కు తిరస్కరించారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ​ జిల్లా రాయ్​పుర్​ గ్రామంలో జరిగింది.

ఇదీ జరిగింది:బిల్సి తహసీల్దార్ ప్రాంతంలోని రాయ్​పుర్​ గ్రామానికి చెందిన దినేశ్​ అనే వ్యక్తి తన కూతురు ఆర్తిని తీసుకుని అడ్మిషన్​ ఇవ్వాలని ప్రాథమిక పాఠశాలకు శనివారం వెళ్లాడు. టీచర్​ ఎక్తా వర్షిణి అడ్మిషన్​ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆధార్​ కార్డులో బాలిక పేరు స్థానంలో 'మధు కా పాంచ్​ వా బచ్చా' అని హిందీలో ' బేబీ ఫైవ్​ ఆఫ్​ మధు' అని ఆంగ్లంలో రాసి ఉంది. కాని ఆర్తి అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే తిరస్కరించినట్లు ఉపాధ్యాయురాలు తెలిపారు. ఆధార్​ కార్డును సరిచేసుకుని తీసుకురావాలని దినేశ్​కు సూచించారు.

వైరల్​గా మారిన ఆధార్​ కార్డు

ఈ అంశంపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్​ దీపా రంజన్​..'ఆధార్​ కార్డులను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో సిద్ధం చేస్తారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతాయి. కార్డు తయారైన బ్యాంకు, పోస్టాఫీసు అధికారులను అప్రమత్తం చేసి నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం' అని పేర్కొన్నారు.

వింత పేరుతో ఉన్న బాలిక ఆధార్​ కార్డు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ కార్డుపై ఆధార్​ నంబర్​ సైతం లేకపోవటం గమనార్హం. అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చూడండి:Old couple request for pension : ఆధార్ లేదని నిరాదరణ.. సాయం కోసం వృద్ధుల నిరీక్షణ

ABOUT THE AUTHOR

...view details