ప్రేమించిన అమ్మాయి తనను పెళ్లి చేసుకొకుండా మరొకరిని వివాహమాడిందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది ఆ యువతిని హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటక దావణగెరెలోని పీజే బరంగయ్‌లో గురువారం ఉదయం జరిగింది. ప్రేయసిని హత్యచేసిన తర్వాత ఆ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. మరణించిన యువతిని వినోబానగర్కు చెందిన చాంద్ సుల్తానా(24) గా పోలీసులు గుర్తించారు.
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రియురాలి హత్య.. ఆపై విషం తాగిన యువకుడు - ప్రేయసిని హత్య చేసిన యువకుడు న్యూస్
తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న కోపంతో ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు. అనంతరం నిందితుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటక దావణగెరెలో జరిగింది.
ఏం జరిగిందంటే..
హరిహర ప్రాంత నివాసి చాంద్ పార్ అలియాస్ సాదత్.. వినోబానగర్కు చెందిన చాంద్ సుల్తానా(24) అనే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పాడు. అయితే ఆ యువతి మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని యువతిని సాదత్ బెదిరించాడు.
అయితే, ఆ యువతి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో సాదత్.. ఉదయం బైక్పై వెళ్తున్న సుల్తానాను హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత సాదత్ కూడా చనిపోవాలని భావించాడు. ఈ క్రమంలోనే విషం తాగాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిందితుడుని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.