తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Young boy murder in nalgonda : కూతుర్ని వేధిస్తున్నాడని.. యువకుడిని కొట్టి చంపారు - తెలంగాణ నేర వార్తలు

Young boy murder in Koppulu village nalgonda district : తమ కుమార్తెను తరచూ వెంటపడి వేధిస్తున్నాడనే నెపంతో యువకుడిని.. యువతి తండ్రి విచక్షణా రహితంగా బాదాడు. దీంతో తీవ్రంగా గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో జరిగింది.

murder
murder

By

Published : May 25, 2023, 9:05 PM IST

Updated : May 25, 2023, 10:54 PM IST

Young boy murder in Koppulu village nalgonda district : తమ కూతురు వెంట పడొద్దని మొదట బెదిరించారు. తర్వాత షీ టీమ్​కు ఫిర్యాదు చేశారు. తన తీరు మార్చుకోని యువకుడు.. యువతి ఇంటికి రావడం ప్రారంభించాడు. దీంతో విసిగి వేసారిన యువతి తండ్రి.. తన ఇంటికి వచ్చిన యువకుడిని చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో జరిగింది. అదే గ్రామానికి చెందిన బాలిక నల్గొండలో పదోతరగతి చదువుతోంది. కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్‌(18) నకిరేకల్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం నుంచి సంతోష్‌.. బాలిక వెంటపడుతుండగా ఆమె తల్లిదండ్రులు షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో షీటీమ్‌ పోలీసులు నల్గొండలో సంతోష్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతిని కలవడానికి ఇద్దరు స్నేహితులతో కలిసి సంతోష్‌ కొప్పోలుకు వచ్చాడు. బాలిక కోసం ఇంటికి రాగానే బయట వీధిలో ఉన్న ఆమె నాయనమ్మ చూసి బయట గడియపెట్టింది. దీంతో స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. వెంటనే వచ్చిన బాలిక తండ్రి యాదయ్య, కుటుంబసభ్యులతో కలిసి సంతోష్‌పై కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవ వధువు కిడ్నాప్​.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో దైవ సన్నిధిలో ఒక్కటైన ప్రేమ జంటపై దాడి చేసి వధువును అపహరించారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో పెళ్లి చేసుకొని వస్తున్నారని.. సమాచారం తెలుసుకున్న అమ్మాయి తరపు వాళ్లు తాళి కట్టిన వ్యక్తిని తప్పించి వధువును మరో కారులో తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన వారిగా గుర్తించారు. అయితే రెండు రోజుల ముందే అమ్మాయి తప్పిపోయినట్లు.. ఆమె తల్లిదండ్రులు మడికొండ పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హుజురాబాద్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details