తనకు దక్కుతుందన్న ఆశో! చివరి సారి చూడాలన్న తపనో! తెలియదు గాని ఉత్తర్‌ప్రదేశ్ భదోహికి చెందిన ఓ యువకుడు పెళ్లికూతురు వేశంలో ప్రియురాలి పెళ్లికి వెళ్లాడు. ఎవరూ తనని గుర్తుపట్టరని అనుకున్నాడు. అయితే అతడు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది.
పెళ్లికూతురు వేషంలో.. ప్రియురాలి పెళ్లికి.. - ఉత్తర్‌ప్రదేశ్ ట్రెండింగ్ న్యూస్
ప్రేమ ఏదైనా చేస్తుంది.. చేయిస్తుంది అనడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహిలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. ప్రియురాలి పెళ్లి అవుతుందని ఉండబట్టలేక ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. పెళ్లికూతురు వేషంలో మండపానికి వెళ్లాడు. అయితే అక్కడి వారు అతడిని గుర్తించి పట్టుకోవటం వల్ల కథంతా అడ్డం తిరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రియురాలి పెళ్లి
మండపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ప్రియుడు పెళ్లి కూతురు బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. అతనెవరో తెలుసుకున్న బంధువులు.. ఆ భగ్న ప్రేమికుడిని మందలించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి:పాండాకు ప్రెగ్నెన్సీ- ఆ రెస్టారెంట్ల షేర్లకు రెక్కలు