తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం కోసం డబ్బులివ్వాలని టవర్ ఎక్కి... - సెల్ టవర్ ఎక్కిన యువకుడు వార్త

తాగుడుకు బానిసైన ఓ యువకుడు సెల్​ఫోన్ టవర్​పైకి ఎక్కి నానా యాగీ చేశాడు. మద్యం కొనుక్కునేందుకు డబ్బులిస్తే గానీ కిందకు దిగనంటూ మొండికేశాడు. ఆ వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అనేక తంటాలు పడ్డారు.

young man climbs mobile tower
తాగిన మత్తులో సెల్​టవర్ ఎక్కి...

By

Published : Jun 17, 2021, 12:58 PM IST

ఒడిశా జార్సుగూడలోని ఎకతాలి పట్టణంలో సంతోష్ పటేల్ అనే యువకుడు హల్​చల్ చేశాడు. సెల్​ఫోన్ టవర్​పైకి ఎక్కి దిగనంటూ మొండికేశాడు. మద్యం కోసం డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని యువకుడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు.

సెల్​టవర్​పై యువకుడు

యువకుడు ఎప్పుడూ తాగుతూనే ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. రూ.5 వేలు ఇస్తేనే దిగుతానని సంతోష్ మొండికేశాడు. చివరకు డబ్బులు ఇచ్చేందుకు యువకుడి బంధువు ఒప్పుకున్న తర్వాత టవర్​పై నుంచి సంతోష్ దిగి వచ్చాడు. మూడు గంటల పాటు ఈ తతంగం కొనసాగింది.

ఇదీ చదవండి:పశువుల కాపరి రూ.5 కోట్ల పన్ను మోసం!

ABOUT THE AUTHOR

...view details