తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మ నగలు తనఖా పెట్టి.. కొవిడ్​ ఆస్పత్రి నిర్మాణం! - Chatrapati Shivaji Maharaj Covid Hospital

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న వేళ పడకలు, ఆక్సిజన్​ కొరత వెంటాడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొందరు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పుణెకు చెందిన ఓ యువకుడు ఏకంగా కుటుంబసభ్యుల నగలు తనఖా పెట్టి.. కొవిడ్​ ఆస్పత్రిని నిర్మించాడు.

covid hospital in pune
కొవిడ్​ ఆస్పత్రి

By

Published : May 6, 2021, 7:46 PM IST

కొవిడ్​ రోగుల కోసం.. తన తల్లి, భార్య నగలు తనఖా పెట్టి కొవిడ్​ ఆస్పత్రి నిర్మించాడు మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ యువకుడు. కరనా వేళ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు ఉమేశ్​ చవాన్​.

35 ఔన్సుల బంగారం..

పుణెలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఒక పడకనే ముగ్గరు రోగులు పంచుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్​ అందక ఎందరో విగతజీవులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన ఉమేశ్​.. ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 'పేషెంట్​ రైట్స్​ కౌన్సిల్​' సంస్థ అధినేత అయిన ఉమేశ్​.. అనుకున్నదే తడవుగా ఇంట్లో ఉన్న తల్లి, భార్యకు చెందిన 35 ఔన్సుల పసిడిని తాకట్టుపెట్టాడు. తద్వారా రూ.30 లక్షలు వరకు సమకూరింది. ఈ మహాయజ్ఞానికి కొందరు దాతల సైతం సాయం చేశారు.

కొవిడ్​ కేర్​ ఆస్పత్రి
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పడకలు

ఏడు రోజుల్లో ఆస్పత్రి రెడీ

ఆస్పత్రి నిర్మాణానికి డబ్బు సమకూర్చుకున్న ఉమేశ్​.. తన సహోద్యోగుల సాయంతో కేవలం ఏడు రోజుల్లోనే 53 పడకల ఆస్పత్రిని నిర్మించాడు. దీనికి 'ఛత్రపతి శివాజీ మహారాజ్​ కొవిడ్​ ఆస్పత్రి' అని నామకరణం చేశాడు. ఇందులో 33 ఆక్సిజన్ పడకలు ఉండగా.. మరో 20 సాధారణ పడకలు ఏర్పాటు చేశారు.

ఆక్సిజన్​ పడకలు
సాధారణ పడకలు

ఈ ఆస్పత్రిని నిర్మించడంలో డాక్టర్​ సలీం అల్తేకర్, డాక్టర్ కిశోర్ చిపోల్, గిరీష్ ఘాగ్, కునాల్ టింగ్రే, అపర్ణ సాఠే కీలక పాత్ర పోషించారు. ఈ కొవిడ్​ ఆస్పత్రిని స్థాపించడానికి పుణె మున్సిపల్​ కార్పొరేషన్​ హెల్త్​ చీఫ్​ డాక్టర్​ ఆశిష్​ భారతి, మాజీ డిప్యూటీ మేయర్​, డాక్టర్​ అమోల్​ దేవలేకర్​ సహాయపడ్డారని ఉమేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి:కొవిడ్​ ఆస్పత్రిలో కార్టూన్ల సందడి

ABOUT THE AUTHOR

...view details