టీకా సరఫరా విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయనకు రక్షణ కల్పించాలంటూ బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పూనావాలాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది దత్తా మానె కోరారు. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కొందరు రాజకీయ నాయకులు టీకా డోసుల కోసం అదర్ పూనావాలాను బెదిరించారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర డీజీపీ, పుణె కమిషనర్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. టీకా తయారీదారులు అభద్రతా భావంతో ఉంటే ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు.
పూనావాలాపై ఒత్తిడి