తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహజీవనానికి 'నో' చెప్పాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి! - కేరళ న్యూస్ టుడే

తనతో బ్రేకప్ అవుతున్నాడనే కారణంతో ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడిందో మహిళ. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వీరి మధ్య తలెత్తిన ఓ వివాదమే ప్రస్తుత దాడికి కారణంగా తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

acid attack
యాసిడ్ దాడి

By

Published : Dec 4, 2021, 8:10 PM IST

coimbatore acid attack:గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడిపై యాసిడ్​ దాడికి పాల్పడిందో మహిళ. ఆపై తానూ భయంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని కోయంబత్తూర్​లో వెలుగుచూసిందీ ఉదంతం.

తనతో ఉండనన్నాడని..

living relationship in coimbatore: కోయంబత్తూరుకు చెందిన జయంతి(27), రాకేశ్(30) గత కొన్ని నెలలుగా ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేస్తున్నారు. కేరళకు చెందిన రాకేశ్ ఓ పని నిమిత్తం ఇటీవలే తన స్వగ్రామానికి వెళ్లివచ్చాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి జయంతితో సంబంధం తెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అందులో భాగంగా.. 'తాను కేరళలో ఓ మహిళను వివాహం చేసుకున్నానని.. అందువల్ల తనతో సహజీవనం చేయలేనని జయంతికి అబద్ధం చెప్పాడు. దీనితో కోపోద్రిక్తురాలైన జయంతి.. రాజేశ్​పై యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఆనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

బాధితులు చికిత్స పొందుతున్న పీలమేడు ప్రభుత్వాసుపత్రి

దీనిపై సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. జయంతిపై 323, 324, 326(ఏ) సెక్షన్ల కింద, రాజేశ్​పై 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details