Woman Elopes With Lover Leaving Children: భర్త చనిపోయిన ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని విదిశా జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై ఆమె పిల్లల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవలే ఆమె భర్త ఇతర కారణాల వల్ల గ్రామంలోని వాటర్ ట్యాంక్పై నుంచి దూకి చనిపోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. విదిశా జిల్లా శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రాణి అహిర్వార్(30) భర్త కొన్ని రోజుల క్రితం వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి చనిపోయాడు. ఆ తర్వాత రాణి తన ఆరుగురు పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి.. ఎదురింట్లోనే ఉన్న తన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు అనాథలైన ఆ పిల్లలను తీసుకుని శంషాబాద్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాణి భర్త చనిపోవడం వల్ల ఆమెకు రూ.15 లక్షల పరిహారం అందనుంది. అందుకోసం బంధువులు.. రాణి బ్యాంకు ఖాతాను రద్దు చేయాలని, ఆ డబ్బులు పిల్లలకు అందేటట్లుగా చూడాలని కోరారు.