కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువలకు జన్మనిచ్చింది(3 babies in one delivery). అయితే.. ఏడో నెలలోనే సాధారణ కాన్పు కావటం గమనార్హం. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఏడో నెలలోనే డెలివరీ- ఒకే కాన్పులో ముగ్గురు జననం! - ఏడో నెలలోనే డెలివరీ
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది(3 babies in one delivery) ఓ మహిళ. నెలలు నిండక ముందే.. ఏడో నెలలోనే సాధారణ కాన్పు జరిగింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లాలోని గోకర్నా గ్రామానికి చెందిన హలీమా సాదిక్ సాబ్ అనే మహిళ ఏడు నెలల గర్భిణి. ఆదివారం నొప్పులు రావటం వల్ల కుంట తాలుకాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. పరిశీలించిన వైద్యులు.. వెంటనే డెలివరీ చేయాలని తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులు (ఇద్దరు ఆడ, ఒక మగ శిశువు)కు జన్మనిచ్చింది హలీమా. నెలలు నిండకముందే పుట్టిన క్రమంలో చిన్నారులను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి:3 babies in single normal Delivery: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు