తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ఎక్కడంటే - వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు

ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ మొదలవుతుందో, ఎవరి మధ్య మొలకెత్తుతుందో చెప్పలేం. ప్రేమ దేన్నైనా ఎదురించి సాధిస్తుంది అనే దానికి తార్కాణం ఈ ఘటన. బంధువులు కాదన్నా, సంఘం వద్దన్నా వారి మనసులు కలిశాయి. పెద్దవారిని ఒప్పించి ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ జరిగిందంటే..

woman and girl marriage
A woman from Tamil Nadu and a girl from Bangladesh got married in a traditional way in Chennai.

By

Published : Sep 6, 2022, 7:48 PM IST

పెద్దవారిని ఒప్పించి మరీ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
వివరాల్లోకెళ్తే.. సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్​గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్​గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్​లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.

కుటుంబ సభ్యులతో.. పెళ్లి చేసుకున్న మహిళలు

బంగ్లాదేశ్​కు చెందిన టీనా దాస్​ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు (లెస్బియన్)​ అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్​గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్​ యాప్​ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.
ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఆగస్టు 31న ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి

"సుభిక్షా శరీరంలో మార్పుల సంగతి తెలిసిన తర్వాత షాక్​కు​ గురయ్యా. ఇండియాలో ఇలాంటి సంబంధాల గురించి మా బంధువులు ఏవిధంగా అనుకుంటారో అని భయపడ్డా. సుభిక్షా కూడా ఈ సమాజంలో ఎలా బతుకుతుంది.. ఆమె వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అనే విషయాలు ఆందోళన కలిగించాయి. అయితే నా కుమార్తె ఆనందంగా ఉండటం కూడా నాకు మఖ్యమే. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నా." అని సుభిక్షా తల్లి పూర్ణ పుష్కల అన్నారు.
"నేను పుట్టి పెరిగింది బంగ్లాదేశ్​లోని మౌళి బజార్​. చిన్నప్పటినుంచే నాకు మహిళలపై ఆసక్తి ఉండేది. ఈ విషయం తెలిసి నా తల్లిదండ్రులు మందలించారు. అందుకే 19 సంవత్సరాలకే నాకు పెళ్లి చేశారు. నాకు అతనితో కలిసి జీవించాలని లేదు. అందుకే నాలుగు సంవత్సరాల తర్వాత అతడి నుంచి విడిపోయాను. దాంతో కొన్ని రోజులు నా కుటుంబం కూడా నాతో దూరంగా ఉంది" అని టీనా దాస్​ చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

మెటల్ ల్యాంప్​తో భార్యను హతమార్చిన భర్త.. అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details