తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త హత్య.. ఫ్రిడ్జ్​లో 10 శరీర భాగాలు.. దిల్లీలో మరో 'శ్రద్ధ' తరహా దారుణం - కుమారుడితో కలిసి భర్త హత్య

దిల్లీలోని పాండవ్​ నగర్​లో భర్తను హత్య చేసి, 10 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్​లో పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.

woman chopped husband body
భర్తను చంపి ముక్కలు చేసిన భార్య

By

Published : Nov 28, 2022, 12:45 PM IST

Updated : Nov 28, 2022, 2:28 PM IST

భర్త హత్య.. ఫ్రిడ్జ్​లో 10 శరీర భాగాలు.. దిల్లీలో మరో 'శ్రద్ధ' తరహా దారుణం

దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ దారుణ హత్యను మరచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి బయటపడింది. కుమారుడి సాయంతో ఓ మహిళ తన భర్తను పాశవికంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇద్దరూ కలిసి 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్​లో దాచిపెట్టారు. తర్వాత అర్ధరాత్రి సమయంలో దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశారు. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లీ కుమారులను దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పు దిల్లీలోని త్రిలోక్‌పురిలో అంజన్‌ దాస్‌ కుటుంబం నివసించేది. ఈయన భార్య పేరు పూనమ్ కాగా.. కుమారుడు దీపక్‌. అంజన్‌దాస్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన పూనమ్‌.. అతడికి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత కుమారుడితో కలిసి కిరాతకంగా హత్య చేసిందని పోలీసులు తెలిపారు. అనంతరం శరీర భాగాలను 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్​లో భద్రపరిచి తూర్పు దిల్లీలోని పాండవ్ నగర్ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో విసిరేశారని వెల్లడించారు.

ఈ శరీర భాగాలు శ్రద్ధా వాకర్‌వే అని కూడా పోలీసులు తొలుత అనుమానించారు. కానీ విచారణలో ఈ శరీర భాగాలు అంజన్‌దాస్‌విగా పోలీసులు గుర్తించారు. తండ్రి శరీర భాగాలను దీపక్‌ వేర్వేరు ప్రాంతాల్లో పడేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బహిర్గతమయ్యాయి. దీపక్ అర్థరాత్రి చేతిలో బ్యాగ్‌తో నడుస్తుండగా వెనక తల్లి కూడా అనుసరించినట్లు వీడియోలో ఉంది. శరీర భాగాలను పడేసేందుకు వీరిద్దరూ అనేక ప్రాంతాలకు వెళ్లారని పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ హత్య చేసి 35 ముక్కలుగా చేశాడు. దేశవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది.

Last Updated : Nov 28, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details