A wedding was called off at the last minute in Jagtial : తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పెళ్లి చేసేశారు. గారాల పట్టీ అయిన చిన్న కూతురి వివాహం.. ఉన్నంతలో అంగరంగ జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులతో ఇళ్లంతా సందడిగా మారిపోయింది. అప్పటి వరకు వివాహ పనులతో అలసిపోయిన వారంతా.. ఉదయాన్నే తొందరగా లేవాలనుకుంటూ నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు, బంధువులంతా తెల్లవారుజామునే లేచి పెళ్లి పనులు మొదలెట్టారు. ముహూర్తానికి మరికొన్ని గంటలే ఉండటంతో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.
తెల్లవారినా పెళ్లి కూతురు ఇంకా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అలసిపోయి నిద్ర పోతుందేమోలే అనుకున్నారు. ఒకటి, రెండుసార్లు డోర్ కొట్టినా.. లోపలి నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఇంకాసేపు పడుకోనీలే అనుకుని ఊరుకున్నారు. చూస్తుండగా ముహూర్తం టైం దగ్గరపడుతుంది. ఇక లాభం లేదనుకుని పెళ్లి కూతురిని లేపేందుకు మరోసారి గది వద్దకు వెళ్లారు. పిలిస్తే పలకకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో వారిలో మెల్లిగా ఆందోళన మొదలైంది. బలవంతంగా డోర్ తెరిచి చూసేసరికి ఇంట్లో బెడ్‌పై పడుకుని ఉండాల్సిన అమ్మాయి లేదు.
చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆందోళన అంతకంతకూ ఎక్కువవుతుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఈ టైంలో తమ పక్కనే ఉండాల్సిన చాలా దగ్గరి బంధువు ఒకరూ కనిపించకపోవడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన కాస్తా అనుమానంగా మారింది. కొన్ని పరిణామాల అనంతరం చివరకు అదే నిజమైంది. దీంతో పెళ్లి కుమారుడి తరఫు బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని చావు వార్త చల్లగా చెప్పడంతో చివరి నిమిషంలో ఆ వివాహం రద్దైంది. వివరాల్లోకి వెళితే..