తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడాదిగా జీరో కరోనా మరణాలు​​.. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లింపు - zero covid deaths in villages

Zero Covid Deaths: ఓ గ్రామస్థులు సామూహికంగా తలనీలాలు సమర్పించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ఆ ఊరిలో ఒక్క కొవిడ్​ మరణం నమోదు కాకపోవడం వల్ల వినూత్నంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని నీముచ్​లో జరిగింది.

Zero covid deaths village
Zero covid deaths village

By

Published : Jan 2, 2022, 7:31 AM IST

Zero Covid Deaths: గతేడాది కరోనా కారణంగా భారత్​తో పాటు ప్రపంచమంతా అతలాకుతలమైంది. సాఫ్ట్​వేర్​ అప్​డేట్​లా ఒక వేరియంట్​ తర్వాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కబళించి మానవాళికే ముప్పుగా పరిణమించింది. అయితే మధ్యప్రదేశ్​ నీముచ్​ జిల్లాలోని దేవరి ఖవాసా గ్రామం మాత్రం ఇందుకు మినహాయింపు. 2021లో ఆ ఊరిలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం.

దేవరి ఖవాసా జనాభా 2,500 మంది. దేశంలో ఏ చిన్న ప్రాంతాన్ని వదలని వైరస్​ ఆ ఊరు కూడా పాకింది. ఫలితంగా కొందరు వైరస్​ బారినపడ్డారు. అయితే ఏడాది కాలంలో కరోనాతో ఏ ఒక్కరూ చనిపోలేదు. దీంతో తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు. దేవ్​నారాయణ ఆలయంలో 90 మందికిపైగా దేవుడికి సామూహికంగా తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అన్నాదాన కార్యక్రమం నిర్వహించారు. దేవుడి పాటలకు నృత్యాలు చేశారు.

కరోనా ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రామంలోని 25 నుంచి 30 మంది వైరస్​ బారిన పడ్డారు. ఆ సమయంలో "గ్రామస్థులంతా దేవ్​నారాయణ ఆలయానికి వెళ్లి, 2021లో కరోనా కారణంగా ఎవరూ చనిపోకుండా ఉంటే.. తలనీలాలు సమర్పించి, భండారా(విందు) ఏర్పాటు చేస్తామని మన్నత్​(ప్రతిజ్ఞ) చేశాం" అని ఆ గ్రామస్థుడు అంబాలాల్​ పాటిదర్​ తెలిపారు.

ఇదీ చూడండి:మేకల్ని దొంగలించిన పోలీస్- న్యూఇయర్ పార్టీ కోసం..

ABOUT THE AUTHOR

...view details