Free Radio to Villagers: ఒకప్పుడు రేడియోలు సమాచారాన్ని చేరవేయడంతో పాటు పాత పాటలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేవి. ఓ విధంగా చెప్పాలంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో రేడియో ఎంతో అవసరమైనదిగా ఉండేది. దేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారాన్ని ఆల్ ఇండియా రేడియో మారుమూల గ్రామాలకు చేరవేసేది. పంట సాగు విధానంలో ఎలాంటి మెలకువలు పాటించాలనే విషయాలతోపాటు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించేది. ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా ప్రజలకు నిత్యం రేడియో చేరువయ్యేది. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులకు గత స్మృతులు కనుమరుగవుతున్నాయి. ఆనాటి రోజులను మళ్లీ తీసుకురావాలని కేరళ కోజికోడ్ జిల్లాలో ఓ పంచాయతీ నడుం బిగించింది. కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను గ్రామం ఊరి ప్రజలంరందరికీ ఉచితంగా రేడియోలను అందించడానికి సంకల్పించింది.
Kozhikode Radio Donation
'నా రేడియో' అనే పేరుతో అనయంకున్ను గ్రామ ప్రజలకు పంచాయతీ అధికారులు రేడియోలు పంపిణీ చేస్తున్నారు.మొదట వృద్ధులు, అనారోగ్యం పాలైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అనంతరం ఇంటికి ఒకటి చొప్పున అందించి.. యువతకు రేడియోల పట్ల ఆసక్తి కలిగించాలని భావిస్తున్నారు.