తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా అందరి గమ్యం అగ్నిపథ్​'.. ఆ గ్రామ యువత ప్రతిజ్ఞ! - అగ్నిపథ్​ పథకం కింద సైన్యంలో చేరుతామని యువకులు ప్రతిజ్ఞ

AGNIPATH SCHEME: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకం కింద సైనికులుగా చేరతామని ప్రతిజ్ఞ చేశారు గుజరాత్​లోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులు.

Agnipath scheme
అగ్నిపథ్​ పథకం కింద సైన్యంలో చేరుతామని ప్రతిజ్ఞ చేస్తున్న యువకులు

By

Published : Jun 27, 2022, 12:59 PM IST

AGNIPATH SCHEME: 'అగ్నిపథ్‌'కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గుజరాత్​లోని ఓ గ్రామానికి యువతీయువకులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరతామని 500 మంది యువతీయువకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఘటన జునాగఢ్ జిల్లాలోని లిమ్​ధరా గ్రామంలో జరిగింది. వీరి నిర్ణయం పట్ల లిమ్​ధరా గ్రామ సర్పంచ్ ప్రవీణ్ భల్లా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఆయన ప్రశంసించారు.

అగ్నిపథ్​కు మద్దతుగా ప్రతిజ్ఞ చేస్తున్న యువతీయువకులు

అగ్నిపథ్​కు మద్దతుగా: లిమ్​ధరా గ్రామస్థులు అగ్నిపథ్​కు మద్దతు తెలిపారు. అగ్నిపథ్​ పథకం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఇప్పటివరకు అగ్నిపథ్​కు మద్దతుగా ప్రమాణం చేసిన మొదటి గ్రామం లిమ్​ధరానే అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని అనేక రాష్ట్రాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ సమయంలో జునాఘఢ్​కు చెందిన 500 మందికి పైగా యువతీయువకులు ఈ పథకం కింద భారత సైన్యంలో చేరతామని ప్రతిజ్ఞ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అగ్నిపథ్​ పథకం కింద సైన్యంలో చేరుతామని ప్రతిజ్ఞ చేస్తున్న యువకులు

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే అభిమతంతోనే వీరందరూ ప్రమాణం చేశారని లిమ్​ధరా గ్రామ సర్పంచ్​ ప్రవీణ్ భల్లా తెలిపారు. "అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరేవారు లిమ్​ధరా నుంచే ఎక్కువ మంది ఉండాలని కోరుకున్నాను. యువతులు కూడా ప్రతిజ్ఞ చేయడం సంతోషంగా అనిపించింది. ఈ ప్రతిజ్ఞ ద్వారా యువతీయువకులు దేశం పట్ల వారికున్న దేశభక్తిని చాటుకున్నారు" అని ఆయన అన్నారు.

ఇవీ చదవండి:'ఆ​ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు.. మొత్తం స్క్రిప్ట్​ భాజపాదే'

తీస్తాకు జులై 2 వరకు పోలీసు కస్టడీ.. కేసు విచారణకు సిట్​

ABOUT THE AUTHOR

...view details