బంగాల్లో తొలి దశ ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు ఎన్నికల విధుల కోసం ఉపయోగించిన ఓ వాహనానికి నిప్పంటించారు దుండగులు. పురులియా జిల్లాలోని బంద్వాన్లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ స్టేషన్లో అధికారులను విడిచి వెళ్తున్న క్రమంలో నక్సల్ ప్రభావిత ప్రాంతం జంగల్ మహల్‌లోని తుల్సిడిలో వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి కొందరు ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చి వాహనాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు.
బంగాల్లో ఎన్నికల వాహనం దహనం
బంగాల్లో తొలి దశ పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ఓ ఎన్నికల వాహనాన్ని తగలబెట్టారు దుండగులు. నక్సల్ ప్రభావిత ప్రాంతం తుల్సిడిలో ఈ ఘటన జరిగింది.
బంగాల్లో ఎన్నికల వాహనం దహనం
ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని సమాచారం. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా పురులియాలోని 9 శాసనసభ స్థానాలకు శనివారమే పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి:కొవిడ్ నిబంధనల మధ్య తొలి దశ పోలింగ్
Last Updated : Mar 27, 2021, 9:47 AM IST