Avinash Reddy anticipatory bail : మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. అవినాష్ రెడ్డి ఏప్రిల్ లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. రోజూ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రాతపూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలంటూ... సీబీఐకి సూచించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా విచారణ చేపట్టాలంటూ ఏప్రిల్ 24న ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 27, 28 తేదీల్లో విచారణ చేపట్టినప్పటికీ... వాదనలు పూర్తి కాకపోవడంతో జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వులు, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ జారీచేయడానికి నిరాకరించారు. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి అవసరమైన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో తేలితే... అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ వీడే అవకాశం ఉంది.
Avinash Reddy anticipatory bail : ఉత్కంఠ వీడేనా..! అవినాష్‌రెడ్డి బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ - సుప్రీంకోర్టు
Avinash Reddy anticipatory bail : మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణ జరగనుండగా.. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో తేలితే... అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ వీడే అవకాశం ఉంది.
ఆ ఉత్తర్వులు ఓ వింత.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 ముద్దాయి ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రాగా.. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) సంజయ్ జైన్ వాదనలు వినిపించారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను తాము సమర్థిస్తున్నామని, దీనిపై గురువారం కల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయాల్సిందిగా కోరారు. గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదిస్తూ తాము కూడా బెయిల్ రద్దును సవాలు చేస్తూ ఒక ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని.. అది ఇంకా లిస్ట్ కావాల్సి ఉన్నందున దాన్ని కూడా కలిపి విచారించాలని కోరడంతో రెండు కేసులనూ జస్టిస్ నరసింహ శుక్రవారానికి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా వెంటనే సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుని... బెయిల్ రద్దు చేసే సమయంలో మళ్లీ బెయిల్ ఎలా ఇస్తారు? విజ్ఞప్తి లేకుండానే ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ ఆ ఉత్తర్వులను తాము చూశామని, కౌంటర్స్ పేరుతో విషయాన్ని సంక్లిష్టం చేయడానికి బదులు ఈ పిటిషన్‌పై అభిప్రాయం చెప్పడానికి అడ్డంకి ఏముందని సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు. ఏఎస్‌జీ జైన్ స్పందిస్తూ ఈ ఉత్తర్వు బెయిల్ న్యాయశాస్త్రంలో 8వ వింతలా కనిపిస్తోందని, ఇలాంటిది తామెప్పుడూ వినలేదని అన్నారు.
ఇవీ చదవండి :