తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3 రోజుల్లో 260మంది వైద్యులకు కరోనా

Doctors corona: కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముంబయిలో మూడు రోజుల వ్యవధిలోనే 260 మంది రెసిడెంట్​ డాక్టర్లకు వైరస్​ సోకింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Doctors corona, వైద్యులకు కరోనా
ముంబయిలో 3 రోజుల్లో 230మంది వైద్యులకు కరోనా

By

Published : Jan 6, 2022, 8:10 AM IST

Updated : Jan 6, 2022, 9:28 AM IST

Doctors corona: మహారాష్ట్ర, ముంబయిలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది. దీంతో నగరంలో వైరస్​ బారినపడిన రెసిడెంట్​ డాక్టర్ల సంఖ్య 260కి చేరింది. వీరంతా మూడు రోజుల వ్యవధిలోనే వైరస్​ బారినపడ్డారు. మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం, జేజే హాస్పిటల్​ అధ్యక్షుడు గణేశ్​ సోలంకి ఈ విషయాన్ని వెల్లడించారు. నగరవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులంతా వైరస్​ కోరల్లో చిక్కుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ముంబయితో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. దిల్లీ, బంగాల్, బిహార్​లో వందల సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ ఉద్ధృతి తర్వాత ఈ కేసుల సంఖ్య ఎక్కువైంది. అయితే లక్షణాలు స్వల్పంగా ఉండటం, వ్యాధి తీవ్రత లేకపోవడం కాస్త ఊరటనిస్తోంది.

ఇదీ చదవండి:వైద్యులపై కరోనా పంజా.. బిహార్​లో మరో 59మందికి పాజిటివ్​

Last Updated : Jan 6, 2022, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details