తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2.4 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ - oldest woman in India to have received the COVID19 vaccine

దేశంలో ఇప్పటివరకు 2.4 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. మంగళవారం సాయంత్రం నాటికి 10 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు, బెంగళూరులో 103 ఏళ్ల బామ్మకు కరోనా టీకా అందించారు అపోలో ఆస్పత్రి సిబ్బంది.

oldest woman in India to have received the COVID19 vaccine
టీకా వేయించుకున్న అతిపెద్ద వృద్ధురాలు

By

Published : Mar 9, 2021, 11:58 PM IST

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. మార్చి 9 నాటికి 2.4 కోట్ల టీకా డోసులను ప్రజలకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం వరకు 10,28,911 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది. అందులో 7,98,354 మంది తమ తొలి డోసు తీసుకోగా... 2,30,557 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్ వర్కర్లు రెండో డోసు స్వీకరించారు.

మరోవైపు, కర్ణాటకకు చెందిన జే కామేశ్వరి కొవిడ్ టీకా తీసుకున్న అతిపెద్ద వృద్ధురాలిగా నిలిచారని బెంగళూరు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 103 ఏళ్ల వయసున్న ఆమె మంగళవారం వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమే అతిపెద్ద వయస్కురాలని ఆసుపత్రి వెల్లడించింది.

103 ఏళ్ల కామేశ్వరికి కరోనా టీకా

ఇదీ చూడండి:ఎన్నికల ముందు బంగాల్‌ డీజీపీ బదిలీ

ABOUT THE AUTHOR

...view details