Porbandar Ship Sank: గుజరాత్‌లోని పోర్ బందర్ నుంచి యూఏఈకి బయల్దేరిన ఓ ఓడ.. భారీ వర్షం, గాలి కారణంగా అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఎంటీ గ్లోబల్ కింగ్ అనే వాహన నౌక నుంచి ప్రమాద హెచ్చరిక అందిన తర్వాత.. 22 మంది క్రూ సభ్యుల్ని రక్షించింది ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ). ఈ మేరకు ఐసీజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
పోర్ బందర్ తీరం నుంచి యూఏఈకి పెద్ద ఓడలో 6000 టన్నుల తారు తరలిస్తుండగా మునిగిపోయింది. అందులో 22 మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ఐసీజీ.. అత్యాధునిక ఏఎల్‌హెచ్ ధ్రువ్ ఛాపర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
22 మందితో వెళ్తూ సముద్రంలో మునిగిన ఓడ.. ఇండియన్ కోస్ట్‌గార్డ్ తెగువతో...
Porbandar Ship Sank: పోర్ బందర్ నుంచి యూఏఈకి వెళ్తున్న ఓ పెద్ద ఓడ అరేబియా సముద్రంలో మునిగిపోయింది. అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్.. ఆ వాహన నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది.
A ship going from Porbandar to UAE sank in Arabian Sea. Coast Guard rescued Krew members