తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే పోలికతో 'ట్విన్స్​​'.. 6 నెలలుగా అన్న భార్యపై అత్యాచారం.. పాపం ఆమెకు తెలిసేలోపే!

Latur Twins Rape: ఒకే పోలికతో ఉన్న కారణంగా సోదరుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఆరు నెలలకు గుర్తించిన బాధితురాలు అతడు చేసిన దుశ్చర్యను భర్తకు చెప్పింది. ఆశ్చర్యకరంగా ఆ సంబంధాన్ని కొనసాగించాలని ఉచిత సలహా ఇచ్చాడు భర్త. దీంతో అన్నదమ్ములపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్​లో జరిగింది.

A sensation of rape incident in Latur
అన్న భార్యతో తమ్ముడు

By

Published : May 20, 2022, 10:18 PM IST

Latur Twins Rape: ఆ కవలలు పోలికల్లో ఒకే విధంగా ఉంటారు. దీనిని అదునుగా తీసుకున్న ట్విన్స్​​లోని చిన్నోడు.. అన్న భార్యపై కన్నేశాడు. ఆరు నెలలుగా సోదరుడి భార్యతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. బాధితురాలికి భర్తెవరో, మరిదెవరో గుర్తించేందుకు ఆరు నెలలు పట్టింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా.. సంబంధాన్ని అలాగే కొనసాగించమని ఉచిత సలహా ఇచ్చిన ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్​లో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది:నగరంలోని రింగ్​రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది అతడి భార్య. ఆ యువకుడికి మరో సోదరుడు ఉన్నాడు. ఇరువురూ కవలలు కావటం వల్ల దాదాపు ఒకే పోలికలతో ఉంటారు. దీంతో వారిలో తేడాలు గుర్తించలేకపోయింది 20 ఏళ్ల నవ వధువు. దీనిని అదునుగా తీసుకున్న భర్త సోదరుడు ఆమెపై కన్నేశాడు. సోదరుడు లేని సమయంలో లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈ విషయాన్ని ఆరు నెలల తర్వాత గుర్తించింది బాధితురాలు.

తన మరిది చేస్తున్న దుశ్చర్యను గుర్తించిన యువతి.. విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే, ఈ సంబంధాన్ని అలాగే కొనసాగించాలని సూచించాడు. అతడి సమాధానంతో బిత్తరపోయింది యువతి. భర్త పట్టించుకోకపోవటం వల్ల అత్తింటివారికి చెప్పింది. వారు సైతం అదే సెలవిచ్చారు. ఎటూ పాలుపోని ఆమె.. కొద్ది రోజులకు పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటివారు రమ్మని ఫోన్​ చేస్తే తాను రానని స్పష్టం చేసింది. ఎందుకు అత్తవారింటికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు అడగ్గా.. అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయంపై వెంటనే శివాజీనగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని సెక్షన్​ 378, 323, 506, 24 కింద కవల సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:గన్​తో బెదిరించి రేప్​.. పెళ్లి చేసుకొని రూ.5 లక్షలు, బైక్​ డిమాండ్​​​!

218 కిలోల హెరాయిన్​ పట్టివేత.. విలువ రూ.1500 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details