పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి.. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిమానాన్ని తన కళ ద్వారా చాటుకున్నారు. అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు పంజాబ్ కళాకారుడు చంద్రశేఖర్ ప్రభాకర్. ఎలాంటి కొలతలు లేకుండా చెక్కిన ఆ సిలికాన్ విగ్రహాన్ని చూస్తే.. అచ్చం బైడెనే తమ జాతీయ జెండా చేతబూని సెల్యూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
లుథియానాకు చెందిన చంద్రశేఖర్ ప్రభాకర్ వృత్తిరీత్యా శిల్పి. 15 ఏళ్లుగా మైనపు విగ్రహాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ అద్భుత నైపుణ్యంతో.. ప్రముఖుల ప్రతిరూపాలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు ప్రభాకర్. అందులో భాగంగానే.. అమెరికాకు ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ విగ్రహాన్ని.. మైనం, సిలికాన్లతో తయారు చేశారు.