ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలుకపై దారుణంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. దాని తోకకు రాయిని కట్టి కాలువలో ముంచాడు. దీంతో ఆ ఎలుక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బదాయూ జిల్లా పన్వాడియాకు చెందిన వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యక్తి ఎలుకను హింసించి చంపడాన్ని తప్పుబట్టిన ఆయన.. అతని కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను డిమాండ్ చేశాడు.
ఎలుకకు రాయి కట్టి కాలువలో పడేసి హత్య! శవపరీక్ష కోసం జంతుప్రేమికుల డిమాండ్ - ఉత్తర్‌ప్రదేశ్‌లో తోకకు రాయి కట్టి కాలువలో ఎలుక
ఎలుక తోకకు రాయి కట్టి కాలువలో పడేసి చంపాడు ఓ వ్యక్తి. దీనిపై జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలుకకు పోస్ట్‌మార్టం సైతం నిర్వహించాల్సిందిగా విన్నవించాడు.
ఎలుకకు పోస్ట్‌మార్టం సైతం నిర్వహించాల్సిందిగా కోరాడు. తాను ప్రత్యక్షంగా ఆ ఘటనను చూశానని పోలీసులకు తెలిపాడు. ఆ వ్యక్తి తన పిల్లలతో కలిసి ఎలుకను హింసిస్తుంటే వారితో వారించానని.. అయినా తన మాటలు లెక్క చేయకుండా రాయి కట్టి కాలువలో పడేశాడని చెప్పుకొచ్చాడు. ఎలుకను తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అది చనిపోయిందని వెల్లడించాడు.
ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్. ఎలుకకు పోస్ట్‌మార్టం చేయాల్సిందిగా వెటర్నిటీ డాక్టర్‌కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐవీఅర్ఐ బరేలీలో పోస్ట్‌మార్టం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయలేదని, అదుపులోకి మాత్రం తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.