Students Drink Alcohol In Class: తమిళనాడు కాంచీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో క్లాస్‌రూంలోనే మద్యం తాగారు అమ్మాయిలు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఐదుగురు విద్యార్థినిలను సస్పెండ్ చేసింది. వీరంతా డిగ్రీ మొదటి సంవత్సరం వారేనని తెలుస్తోంది. తమ స్నేహితుడే మద్యం తెచ్చాడని.. మద్యం అని తెలిసే తాగినట్లు అమ్మాయిలు ఒప్పుకున్నారు. వీరి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించిన ప్రిన్సిపల్.. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Viral Video: తరగతి గదిలోనే మద్యం తాగిన అమ్మాయిలు - కాంచీపురం న్యూస్
Students Drink Alcohol In Class: తరగతి గదిలోనే మద్యం తాగారు తమిళనాడు కాంచీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థినిలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల ఐదుగురు అమ్మాయిలను సస్పెండ్ చేశారు.
తరగతి గదిలో మద్యం తాగిన అమ్మాయిలు..