కర్ణాటక తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లి బస్సు బోల్తా.. ముగ్గురు మృతి - ప్రైవేటు బస్సు బోల్తా
పెళ్లికి వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలో జరిగింది.
పెళ్లి బస్సు బోల్తా
శంభెనహళ్లి గొల్లహరహట్టి గ్రామం నుంచి బుక్కపటన గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. జిల్లాలోని శిర్ తాలుక మెక్కెరహళ్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 19, 2021, 8:57 PM IST