కర్ణాటకలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లేందుకు సుమారు 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.
ఆస్పత్రికి వెళ్లేందుకు 7కి.మీ నడిచిన గర్భిణీ - 7 కి.మీ నడిచిన కొప్పల గర్భిణి
కర్ణాటకలో లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఓ గర్భిణీ తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్యుల్ని సంప్రదించేందుకు ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లారామె.
గర్భిణి, కాలినడక
కొప్పల జిల్లాలోని నరేగళ్ గ్రామానికి చెందిన లక్ష్మీ.. చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. అయితే.. వాహనాలేవీ తిరగనందున తన తల్లితో పాటు నడుచుకుంటూనే ఆస్పత్రికి వెళ్లారు. తమకు ఎలాంటి వాహనాలు లేనందునే ఇలా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.