Police rescue suicidal girl: ఆత్మహత్య చేసుకుందామని కొండ ఎక్కిన ఓ యువతికి నచ్చజెప్పి దిగేలా చేశారు కేరళకు చెందిన పోలీసు. ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుస్తానని హామీ ఇచ్చారు. అడిమాలీకి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుని కొండ ఎక్కింది. దీనిని చూసిన స్థానికులు.. ఆమెను సముదాయించేందుకు యత్నించారు. అయినా ఆమె వినకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.
సూసైడ్ చేసుకుంటానని కొండ ఎక్కిన యువతి.. ఎస్ఐ ఎంట్రీతో.. - kerala news
ఆత్మహత్య చేసుకుందామని కొండ ఎక్కిన ఓ యువతికి పోలీసు నచ్చజెప్పాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుంది. ఈ సంఘటన కేరళలోని ఇడుక్కిలో జరిగింది.
police rescue suicidal girl
అక్కడికి చేరుకున్న అడిమాలీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. వాటిని అవసరమైతే తానే తీరుస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నాన్ని మానుకొని కొండ దిగింది. ఎస్ఐ సంతోష్‌ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి:చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!