మహారాష్ట్రలోని ముంబయిలో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 25 కేజీల మెఫిడ్రోన్(ఎండీ) అనే డ్రగ్‌ను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ముంబయిలో రూ.12.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత - మెఫిడ్రోన్ డ్రగ్
మహారాష్ట్ర ముంబయిలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నుంచి 12.5 కోట్ల రూపాయల విలువైన మెఫిడ్రోన్(ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు
వీటి విలువ రూ.12.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వివరించారు.