తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యతో గొడవ.. సిలిండర్​ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు - కర్ణాటక

LPG cylinder blast: భార్యతో గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న భర్త గ్యాస్​ సిలిండర్​ పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూర్​ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. మృతుడిని రక్షించే ప్రయత్నం చేసిన ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

LPG cylinder blast
సిలిండర్​ బ్లాస్ట్​

By

Published : May 20, 2022, 3:13 PM IST

LPG cylinder blast: భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. గ్యాస్​ సిలిండర్​ పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాపాడేందుకు వచ్చిన ఇద్దరు పోలీసులకు ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్ణాటక, తుమకూర్​ జిల్లాలోని సోరేకుంటే గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.

ఇదీ జరిగింది:గ్రామానికి చెందిన గోవిందప్ప గురువారం రాత్రి తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి తెలియజేసింది అతడి భార్య. వారు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్​ పోలీస్​ స్టేషన్​ హెడ్​కానిస్టేబుల్​ గవిరంగప్ప, డ్రైవర్​ గులిపప్ప తమ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన గోవిందప్పను ఒప్పించి బయటకు తీసుకొచ్చేందుకు కిటికీలోంచి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇంట్లోని సిలిండర్​ గ్యాస్​ లీక్​ చేసిన గోవిందప్ప.. లైటర్​ వెలిగించాడు. వెంటనే మంటలు అంటుకుని సిలిండర్​ పేలిపోయింది. కిటికీలోంచి లోపలకు చూస్తున్న ఇద్దరు పోలీసుల ముఖం, తలపై కాలిన గాయాలయ్యాయి.

ఈ పేలుడులో దాదాపు పూర్తిగా కాలిన గాయాలతో కొన ఊపిరితో ఉన్న గోవిందప్పను బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన పోలీసులను తుమకూర్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రూరల్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ.. 9 మంది సజీవ దహనం

బడి చుట్టూ నీరు.. పడవలో వెళ్తేనే పాఠం.. పాపం అక్కడి పిల్లలు...

ABOUT THE AUTHOR

...view details