తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యూట్రిషన్​ గార్డెన్'​తో పోషకాహార లోపానికి చెక్​ - కేరళ కోజికోడ్​ జిల్లా

ప్రజలకు పౌష్టికాహారం అందించటమే లక్ష్యంగా తొలిసారి 'న్యూట్రిషన్​ గార్డెన్​' (పోషకాహార తోట) ప్రాజెక్టును అమలులోకి తీసుకొచ్చింది ఐఐఎస్​ఆర్ అనుబంధ​ సంస్థ అయిన కృషి విజ్ఞాన కేంద్రం. కేరళ కోజికోడ్​ జిల్లా కొట్టూర్​ గ్రామం దీనికి వేదికైంది. కొట్టూర్​ గ్రామంలోని 25 కుటుంబాలకు నాణ్యమైన విత్తనాలు, కంపోస్ట్​ ఎరువులు అందించి.. వారికి అవసరమైన శిక్షణ ఇస్తోంది.

Nutrition Garden
'న్యూట్రిషన్​ గార్డెన్'​తో పోషకాహార లోపానికి చెక్​

By

Published : Dec 25, 2020, 6:20 PM IST

కేరళ కోజికోడ్​ జిల్లాలోని కొట్టూర్​ గ్రామ పంచాయతీ క్రమంగా పోషకాహార పంటల సాగులో స్వయం సమృద్ధి సాధిస్తోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు శ్రీకారం చుట్టిన న్యూట్రిషన్​ గార్డెన్​ (పోషకాహార తోట) ప్రాజెక్టు.. కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతోంది.

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ స్పైస్​ రీసర్చ్​ (ఐఐఎస్​ఆర్​) భాగస్వామ్య సంస్థ అయిన కేవీకేతో కలిసి అధికారుల బృందం.. ఈ పోషకాహార తోట ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్వహణ చూసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొట్టూరు​ పంచాయతీలో 25 కుటుంబాలకు కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. పిల్లలు, యుక్తవయస్సు వారు, గర్భణీలకు సరైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో స్థానికంగా ఉండే మూడు అంగన్​​వాడీలను కూడా భాగం చేశారు.

పోషకాహారంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వారికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా కూరగాయల సాగు, సేంద్రీయ వ్యవసాయం, వానపాముల కంపోస్టింగ్​ వంటి కీలకమైన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఆహార భద్రతలో న్యూట్రిషన్​ గార్డెన్​ అద్భుతమైన నమూనాగా పేర్కొన్నారు ఐఐఎస్​ఆర్​ డైరెక్టర్​ డాక్టర్​ సంతోష్​ జే ఈప్పన్​. పిల్లలకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన 'స్మార్ట్​ న్యూట్రిషన్​ విలేజ్​ స్కీం' కింద ఈ పోషకాహార తోట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఏడాది పాటు లబ్ధిదారులకు అన్ని విధాల సాయం అందించి.. ఆ తర్వాత మరిన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

నాణ్యమైన విత్తనాల పంపిణీ..

ఏడాది పాటు సాగే ఈ కార్యక్రమంలో స్థానికంగా, పరిసర ప్రాంతాల్లో దొరికే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. వాటితో పాటు వంటింటి కంపోస్ట్​ ఎరువులను కూడా అందజేస్తారు. ఇంట్లోని వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్​ ఎరువు తయారు చేసి కూడా వినియోగించవచ్చు.

ఇదీ చూడండి:2 చేతులతో 4 భాషల్లో ఎటు నుంచి ఎటైనా రాసేస్తా!

ABOUT THE AUTHOR

...view details