కర్ణాటక రాజధాని బెంగళూరులో అనుమానాస్పద పేలుడు సంభవించింది. విజయ్‌నగర్ కాలనీలోని ఓ రెండంతస్తుల భవనంలో ఆదివారం(ఆగస్టు 15) అర్ధరాత్రి ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు సూర్యనారాయణ శెట్టి(74), పుష్పవతమ్మ(70) తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందం.. మంటలను అదుపులోకి తెచ్చింది. విజయ్‌నగర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మొదట సిలిండర్ పేలిందని.. భావించినా తర్వాత ఏదో అనుమానాస్పద పదార్థం అని పోలీసులు తేల్చారు.