Shivakumara swamiji Birth anniversary: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివకుమార స్వామీజీ 115వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, తుమకూర్ జిల్లాలోని సిద్ధగంగా మఠంలో 115 మంది చిన్నారులకు డాక్టర్ శివకూమార స్వామీజీ ఆనందన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక నామకరణ మహోత్సవం చేపట్టారు. కర్ణాటకలోని రామనగర, బీదర్, రాయ్చుర్ సహా ఇతర ప్రాంతాల నుంచి చిన్నారులు ఇక్కడికి వచ్చారు. అందులో ఓ ముస్లిం బాలికకు శివమణిగా పేరు పెట్టారు కుటుంబ సభ్యులు.
జిల్లాలోని క్యాత్సాంద్రకు చెందిన శహిస్టా, జమీర్ దంపతులు వారి కుమార్తెకు శివమణిగా నామకరణం చేశారు. శివకుమార్ స్వామీజీ ఆలోచనలు తమకు ఆదర్శమని, ఆయన సమానత్వం కోసం పాటుపడినట్లు చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతామని తెలిపారు. శివకూమర స్వామీజీ ఊపిరితిత్తుల సమస్యతో 2019లో శివైక్యమయ్యారు. ఆయన్ని నడిచే దేవుడిగా కొలిచేవారు. విద్య, వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది కేంద్రం. 2007 కర్ణాటక రత్న అవార్డును అందుకున్నారు.