Mother Killed Her Own Child:కర్ణాటకలోనిబెంగళూరులో దారుణ ఘటన జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే తన చేతులారా హతమార్చింది. తర్వాత తాను తనువు చాలించాలనుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అదే సమయానికి ఇంటికి వచ్చిన భర్త తల్లీపిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే బిడ్డ మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులోని డొడ్డన్నకుడిలోని గురురాజా లేఅవుట్లో గాయత్రి అనే మహిళ తన భర్త నరేంద్రన్, మూడున్నరేళ్ల కుమార్తె సంయుక్తతో కలిసి నివాసం ఉంటోంది. నరేంద్రన్.. జబ్బుపడ్డ తన తండ్రిని పరామర్శించడానికి వెళ్లాడు. భర్త ఇంట్లో లేకపోయేసరికి ఆమె బిడ్డను బాత్‌టబ్‌లో ముంచి హతమార్చింది. ఆ తర్వాత ఆమె ఒక సూసైడ్ నోట్‌ను అక్కడ పెట్టి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన నరేంద్రన్ తలుపు తట్టినా ఎవరూ రాకపోవడం వల్ల కిటికిలో నుంచి చూశాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న గాయత్రిని చూసి నివ్వెరపోయిన అతడు.. వెంటనే తలుపులు బద్దలుకొట్టి ఆమెను కాపాడాడు.
పాప కోసం వెతకగా బాత్‌టబ్‌లో విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. గాయత్రి కోలుకున్న తర్వాత ఆమెను విచారిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరికిన సూసైడ్‌నోట్‌లో గాయత్రి.. "ఈ ఒత్తిడులను భరించే శక్తి నాకు లేదు. ఒక వేళ నేను చనిపోతే నా బిడ్డను చూసుకునేందుకు ఎవరూ ఉండరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అని రాసింది.
భార్యను కడతేర్చిన భర్త..
అంతసేపటి వరకు ప్లాట్‌ఫాం మీద నిద్రిస్తూ ఉన్నారు ఆ కుటుంబసభ్యులు. ఇంతలో ట్రైన్ వచ్చింది. నిద్రిస్తున్న తన భార్యను లేపి కదులుతున్న రైలు ముందుకు తోసేశాడు ఓ వ్యక్తి. తర్వాత తన పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.