Woman Gave Birth To Four Children: కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. జిల్లాలోని భద్రావతి తాలూకా తడస గ్రామానికి చెందిన అల్మాబాను సోమవారం ఉదయం నలుగురికి జన్మనిచ్చింది. అల్మాబానుకి ఎనిమిదో నెలలోనే ప్రసవ నొప్పులు వచ్చాయి. వెంటనే, కుటుంబ సభ్యులు ఆమెను ఉదయం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సిజేరియన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మించారు. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
ఒకే కాన్పులో నలుగురు శిశువులు.. ఒకే రోజు రెండు సంఘటనలు - మధ్యప్రదేశ్ వార్తచలు
Woman Gave Birth To Four Children: ఒకే కాన్పులో నలుగులు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. కాగా, శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కూడా ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే వారి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
![ఒకే కాన్పులో నలుగురు శిశువులు.. ఒకే రోజు రెండు సంఘటనలు Woman Gave Birth To Four Children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15367065-thumbnail-3x2-kdkd.jpg)
ఒకే కాన్పులో నలుగురు శిశువులు.. మధ్యప్రదేశ్‌లోని కిర్నాపుల్ జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో.. ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కిర్నాపుర్ తహసీల్‌లోని జరాహి గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రీతి నంద్‌లాల్ మెష్రామ్ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బాలాఘాట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. అయితే నలుగురు పిల్లల పరిస్థితి కాస్త విషమంగా ఉందని శిశు వైద్యుడు డాక్టర్ నిలయ్ జైన్ తెలిపారు. నలుగురు పిల్లలను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చామని, బాలింత ఆరోగ్యంగా ఉందని చెప్పారు
ఇవీ చదవండి:చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల.. తల్లి వానరం ఏం చేసిందంటే?
TAGGED:
madhya pradeshnews