mother jumps into pond along with her two kids: ఆమెకు.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. అందమైన జీవితం. ఎంతో హాయిగా గడిచిపోతోంది. కానీ అంతలోనే అనుకోని విషాదం. అందంగా సాగిపోతున్న ఆ జీవితం ఏం కష్టమొచ్చిందో ఏమో అర్ధాంతరంగా అంతమైపోయింది. తనతో పాటు తన పిల్లలను కూడా తీసుకెళ్లింది. భరించలేని బాధలో, బతకలేని కష్టాలో తెలియదు కానీ కాలం కనుకరించక.. చనిపోవాలనే ఆలోచన మదిలో మెదిలి తన ఇద్దరు కుమారులతో పాటు ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
Mother Suicide with Kids in Khammam : ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకిన తల్లి - ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకిన తల్లి
07:21 May 09
ఖమ్మం జిల్లాలో విషాదం.. చెరువులో దూకి ముగ్గురు మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. దామరచెరువు కట్టపై ఇవాళ కొంత మంది స్థానికులు వాకింగ్ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వారికి చెరువులో మూడు మృతదేహాలు తేలడం కనిపించింది. షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఆ మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మృదుల, ప్రజ్ఞవ్(5), మహదేవ్(7) గా గుర్తించారు. వీరంతా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అయితే మృదుల తన ఇద్దరు కుమారులైన ప్రజ్ఞ, మహదేవ్లను చెరువులోకి తోసి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే వీళ్లది ఆత్మహత్యా లేక హత్య అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై మృదుల కుటుంబాన్ని, స్థానికులను ఆరీ తీశారు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల వల్లే మృదుల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ జరిగింది: సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ చెందిన పాటిబండ్ల ప్రశాంత్(మృతురాలి భర్త) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ తన భార్య మృదుల (40)ఇద్దరు కొడుకులు ప్రజ్ఞవ్ (7) మహదేవ్(5)తో హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో వారం క్రితం భార్యాబిడ్డలతో ప్రశాంత్ ఎన్టీఆర్ నగర్‌లోని తన స్వగృహానికి వచ్చారు. ఈ నెల 8న మృదుల తన ఇద్దరు కొడుకులతో విజయవాడలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లి రాత్రికి తిరిగి సత్తుపల్లికి చేరుకుంది. బస్టాండ్‌లో దిగిన మృదుల ఇంటికి వెళ్లకుండా సత్తుపల్లి లోని దామరచెరువుకు తన కొడుకులతో కలిసి వెళ్లి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఆమెకు ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి ఫోన్ సిగ్నల్‌ని బట్టి చెరువు దగ్గరకు వెళ్లిందని గుర్తించారు.
ఇవీ చదవండి: