Free Fire Game Murder In Koraput: ఒడిశా కొరాపుట్ జిల్లాలో దారుణం జరిగింది. ఫ్రీఫైర్ ఆటలో తలెత్తిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. మసిపుట్ గ్రామానికి చెందిన లులు భోయ్‌ను అతడి ఇద్దరు స్నేహితులు హత్యచేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాణం తీసిన ఫ్రీఫైర్.. బాలుడ్ని రాయితో కొట్టి చంపిన స్నేహితులు - మైనర్ మర్డర్ న్యూస్
Free Fire Game Murder In Koraput: ఫ్రీఫైర్ ఆటలో తలెత్తిన గొడవ కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితులిద్దరే బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కొరాపుట్‌లో జరిగింది.
ఇదీ జరిగింది:మసిపుట్కు చెందిన లులు భోయ్ ఏడో తరగతి చదువుతున్నాడు. లులుతో పాటు అతడి ఇద్దరు స్నేహితులు స్థానిక పాఠశాల సమీపంలో ఫ్రీఫైర్ ఆడుతున్నారు. అయితే, గేమ్ ఓడిపోయిన లులు.. మరోసారి ఆడేలా మొబైల్‌ను ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు కలిసి లులు తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని కోలాబ్ నది దగ్గర పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రేప్ కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులు.. నిప్పంటించుకున్న బాలిక