Gang rape: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణ ఘటన జరిగింది. ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున గోవండిలో ఈ దుర్ఘటన జరిగింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావటం గమనార్హం.
గోవండిలోని శివాజీనగర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మట్టిరోడ్లోని స్లమ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు అత్యాచారం జరిగినట్లు చెప్పారు.
క్యాటరింగ్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో యువతిని మాట్లాడాలని స్లమ్ ఏరియాలోని ఓ గదికి తీసుకెళ్లాడు నిందితుల్లో ఒకడు. తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తికి రైలులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు మైనర్లను శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. వారిని విచారించగా మరొకరి ఆచూకీ లభించింది. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:కూతురిపై రేప్- కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి!