Military Chopper Crash: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సియాంగ్ జిల్లాలోని సింగింగ్ గ్రామానికి 25 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రోడ్డు మార్గం కూడా లేదని సమాచారం. హుటాహుటిన రెస్యూ సిబ్బందిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధికారులు తరలించారు. అతికష్టం మీద 4 మృతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం.. తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అరుణాచల్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్- నలుగురు మృతి - సైనిక హెలికాప్టర్ వార్తలు
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. సియాంగ్ జిల్లాలోని సింగింగ్ గ్రామానికి 25 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రోడ్డు మార్గం కూడా లేదని సమాచారం.
a military chopper crashed in arunachal pradesh
Last Updated : Oct 21, 2022, 6:00 PM IST