దిల్లీలో కొద్ది రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది కేంద్రం. ఈ సమావేశానికి దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దిల్లీ పోలీస్ కమిషనర్, హోంశాఖ అధికారులు హాజరయ్యారు.
కేసుల పెరుగుదల, చేపట్టాల్సిన చర్యలపై గత ఆదివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఓ ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల పెంపు సహా 12 సూచనలు చేశారు. అమిత్ షా సూచనలు అమలు చేసే విషయంపై నేటి సమావేశంలో కీలకంగా చర్చించినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.