టీకా వేయించుకునేందుకు వినూత్నమైన డిమాండ్ చేశాడు కర్ణాటక, ధార్వాడ్‌కు చెందిన వ్యక్తి. టీకా అనంతరం ఆరోగ్య సమస్యలు ఉండవని హామీ పత్రం ఇచ్చిన తర్వాతే వ్యాక్సిన్ వేసుకున్నాడు.
కర్ణాటకవాసి వినూత్న డిమాండ్.. హామీ పత్రం ఇస్తేనే టీకా.. - టీకా హామీ పత్రాన్ని డిమాండ్ చేసిన కర్ణాటక వ్యక్తి
వ్యాక్సిన్ వేసుకుంటే తనకు ఏ ఆరోగ్య సమస్యలు రావనే హామీ పత్రం ఇవ్వాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశాడు కర్ణాటక, ధార్వాడ్‌కు చెందిన వ్యక్తి. హామీ పత్రం ఇచ్చిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో స్థానికులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్. షాపింగ్ మాల్స్, జిమ్స్, బార్లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లకు చెందినవారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనంద్ కుందనూర్ అనే వ్యక్తి టీకా హామీ పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే తనకు ఏ ఆరోగ్య సమస్యలు రావనే హామీ పత్రం ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులందరూ హామీ పత్రంపై సంతకాలు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రపతి పర్యటనలో భద్రతా సిబ్బందికి కరోనా!
TAGGED:
tika Guarantee Letter