తెలంగాణ

telangana

ETV Bharat / bharat

80 అడుగుల బావిలో పడి.. ప్రాణాలతో బయటకు - కర్ణాటక

కర్ణాటకలోని హస్సన్​ జిల్లాలో ఓ వ్యక్తి 80 అడుగుల బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.

hassan, karnataka
80 అడుగుల బావిలో పడి.. ప్రాణాలతో బయటపడి..

By

Published : Feb 9, 2021, 3:48 PM IST

80 అడుగుల లోతు బావిలో పడ్డ ఓ వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హస్సన్​ జిల్లా నారాయణ ఘట్టహల్లీ గ్రామంలో సోమవారం జరిగింది.

ఇదీ జరిగింది..

బావి అరుగు మీద కూర్చున్న మోహన్​ కుమార్​ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాపాడండి అంటూ బాధితుడు మొరపెట్టుకున్నా.. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. దీంతో మోహన్​ మంగళవారం ఉదయం వరకు ఆ బావిలోనే ఉన్నాడు.

బాధితుడు మోహన్​ కుమార్​
80 అడుగుల బావి

గ్రామస్థుల సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మోహన్​ను బయటకు తీశారు. ఈ ఘటనలో బాధితుడు కాలు విచ్ఛిన్నం అయింది. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చదవండి :ఆన్‌లైన్‌ మాయగాళ్ల అరాచకం!

ABOUT THE AUTHOR

...view details