తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒంటరిగా 4 నెలల్లో 40 అడుగుల బావి.. ఊరి కోసం యువరైతు భగీరథ ప్రయత్నం

గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను చూసి చలించిపోయాడు ఓ రైతు. ఇందుకోసం ఏకంగా 40 అడుగుల లోతున్న బావిని తవ్వి ఊరి ప్రజల నీటి కష్టాలను తీర్చాడు. దీంతో అతడిని గుజరాత్​ కా మాంఝీ అని పిలుస్తున్నారు.

Gujarat Farmer Dug 40 Feet Wel
Gujarat Farmer Dug 40 Feet Wel

By

Published : Feb 25, 2023, 9:33 AM IST

కొన్నేళ్ల క్రితం బిహార్​కు చెందిన దశరథ్ మాంఝీ అనే వృద్ధుడు తన గ్రామం కోసం ఎవరూ చేయని సాహసమే చేశాడు. తమ ఊరికి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న పెద్ద కొండను ఒక్కడే తవ్వి మరి గ్రామస్థులు వెళ్లేందుకు దారి వేశాడు. దీంతో ఈయన 'మౌంటెయిన్​ మ్యాన్​గా' గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా గుజరాత్​కు చెందిన ఓ రైతు తన గ్రామంలోని నీటి సమస్యను చూసి చలించిపోయి.. ఏకంగా 40 అడుగుల ఓ బావిని తవ్వాడు. దీంతో ఆ గ్రామంలో నీటి కష్టాలు కొంతమేర గట్టెక్కాయి. దీంతో గుజరాత్​ కా మాంఝీ అని పిలుస్తున్నారు.

4 నెలలు.. 40 అడుగులు..
ఛోటా ఉదేపుర్ జిల్లా మహుడి గ్రామానికి చెందిన ఖుషాల్ భిల్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలో తాగు, సాగునీటి సమస్య తలెత్తడం వల్ల తన వంతుగా గ్రామానికి సహాయపడాలని నిశ్చయించుకున్నాడు. కేవలం 4 నెలల్లోనే 40 అడుగుల లోతు బావిని తవ్వానని ఖుషాల్​ చెబుతున్నాడు. అయితే బావి తవ్విన వెంటనే అందులో నుంచి నీరు రాకపోవడం వల్ల ఖుషాల్​ నిరాశ పడలేదు. వర్షాలు కురిసేంత వరకు ఓపికతో బావిని తవ్వుతూనే ఉన్నాడు​. కాగా, ఈ కార్యంలో ఖుషాల్​ భార్య కూడా అతడికి సాయపడింది.

బావిని తవ్వుతున్న ఖుషాల్​
ఖుషాల్ తవ్విన బావి

"నీరు అనేది ప్రకృతి మనకిచ్చిన ఓ ఉచిత వరం.. అందుకే నీటి విలువ ఎవరికీ అర్థం కావడం లేదు. వేల లీటర్ల నీటిని వృథాగా పోనిస్తున్నారు. నీరు లేకుంటే ఏ పనులు జరగవు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బావుల్లో నీరు చేరుతుంది. బంతువులు, పక్షులు నీరు తాగేందుకు ఈ బావులు ఉపయోగపడుతున్నాయి. ఇంటి దగ్గర చేతి బోరింగ్ పంపు ఉన్నప్పటికీ అందులో నుంచి వచ్చే నీరు తాగడానికి పనికిరావు. దీంతో గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడి ఈ బావిని తవ్వాను. ఇందుకు నాకు 4 నెలల సమయం పట్టింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బావి పక్కనే బోరు వేశారు. దీంతో మా నీటి కష్టాలు కొంతమేర తీరాయి."

-- ఖుషాల్​ భిల్​, యువ రైతు (బావి తవ్విన వ్యక్తి)

ప్రస్తుతం గుజరాత్​ ప్రభుత్వం సుజలాం సుఫలాం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఖుషాల్​ భిల్​ తవ్విన బావి విషయం అధికారుల దృష్టికి వెళ్లడం వల్ల ఈ నెల 22న సంబంధిత శాఖ ఖుషాల్ తవ్విన బావిని సందర్శించారు. అనంతరం పక్కనే బోరును కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ బావిలో 500 అడుగుల మేర నీరు రావడం వల్ల మహుడి గ్రామస్థులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

బావిని తవ్వుతున్న ఖుషాల్​

ABOUT THE AUTHOR

...view details