మానవబాంబుగా మారి ఓ భర్త తన భార్యపై కక్ష తీర్చుకున్నాడు(crime news today). ఆ ప్రయత్నంలో ఇద్దరూ మరణించారు. మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో ఈ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఛన్మరి ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) కూరగాయలు విక్రయించేది. మంగళవారం ఆమె వద్దకు వచ్చిన భర్త సి.రోహ్మింగ్లియానా (62) ఏదో మాట్లాడుతున్నట్లు నటించి, అమాంతం కౌగిలించుకున్నాడు.
మానవబాంబుగా మారి.. భార్యను చంపేసిన భర్త - ఆత్మహుతిదాడి
మిజోరంలో ఓ అసాధారణ ఘటన(Crime News today) జరిగింది. భార్యపై కోపంతో మానవబాంబుగా మారిన భర్త.. ఆమెను కౌగిలించుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దంపతులిద్దరు మరణించారు.
దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకొని వచ్చిన అతడు ట్రిగ్గర్ నొక్కగానే భారీ పేలుడుతో మార్కెట్ దద్ధరిల్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ లుంగ్‌లేయీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ సంఘటనలో మరెవరూ గాయపడలేదని తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఇలా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పేలుడు జరిగిన సమయంలో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి కుమార్తె తల్లికి కొద్దిదూరంలోనే ఉంది. స్థిరమైన ఉపాధి లేని రోహ్మింగ్లియానా భార్యను తరచూ వేధించేవాడు.
ఇదీ చూడండి:'ఆమెను నాతో మాట్లాడమని చెప్పు దేవుడా'.. శివుడికి రోజూ భక్తుడి లేఖ!