తెలంగాణ

telangana

ETV Bharat / bharat

A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

a Lover Attacked with Knife Young Woman
JagathgiriGutta

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 7:08 PM IST

Updated : Sep 1, 2023, 9:39 PM IST

18:57 September 01

యువతిపై కత్తితో దాడి చేసిన నాగరాజు అనే యువకుడు

A Lover Attacked With Knife Young Woman in Jagathgirigutta :సమాజంలో ఆడవారిపై రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు.. క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు.. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగ బడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామని వెంట పడి మోసం చేసే వారు ఇంకొందరు. ఆ ప్రేమను కాదంటే కాల యములుగా మారి ప్రాణాలు తీస్తున్న వారు మరికొందరు. తాజాగా తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో (Lover Attack in Woman Medchal District) చోటు చేసుకుంది.

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

జగద్గిరిగుట్టలో (Jagathgirigutta) దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై నాగరాజు అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. బాధితురాలి మెడ, వీపుపై పొడిచాడు. అనంతరం నాగరాజు.. కత్తితో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే నాగరాజును అడ్డుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి ప్రైవేట్ పాఠశాలలో టీచరుగా పని చేస్తుందని తెలిపారు. నిందితుడు ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

A Lover Cuts young woman Throat in Hyderabad :ఇటీవల ఉప్పల్​లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. హబ్సిగూడకు చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న బంధువైన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక.. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు లక్ష్మీ నారాయణను మందలించారు.

ఈ క్రమంలోనే లక్ష్మీ నారాయణ మాట్లాడుకుందామని‌ కారులో యువతిని ఎక్కించుకొని ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లే అవుట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన నిందితుడు.. బ్లేడుతో యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పథకం ప్రకారమే యువతిపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఏదేమైనా.. ప్రస్తుత రోజుల్లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఏ ఆపద వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటి నుంచి ఇంటికి చేరుకునే దాగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చి.. నిందితులను ఎంత కఠినంగా శిక్షిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం అనుకున్నంత మార్పు తీసుకురాలేకపోతున్నారు. నిత్యం ఏదో ఓ చోట దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి

Last Updated : Sep 1, 2023, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details