తమిళనాడులో ఓ విచిత్ర ఘటన జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన నాలుకను కోసి.. దేవతకు అర్పించిందో మహిళ.
స్టాలిన్ గెలిచారని నాలుక కోసుకున్న మహిళ - తమిళనాడు పోల్స్
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ గెలవాలని మొక్కుకున్న ఓ మహిళ... ఏకంగా తన నాలుకను కోసుకుని దేవతకు అర్పించింది. గుడి వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కొందరు ఆస్పత్రికి తరలించారు.
నాలుక కోసుకున్న మహిళ
వనిత (32) అనే మహిళ ఎన్నికల ముందు.. డీఎంకే గెలిస్తే తన నాలుకను అర్పిస్తానను దేవతకు మొక్కుకుంది. అనుకున్నట్లే ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో ముతలమ్మన్ దేవాలయానికి వెళ్లి.. తన నాలుకను కోసుకుంది వనిత. అయితే కరోనా ఆంక్షలతో గుడి వద్ద భక్తులెవరూ లేకపోవడం వల్ల ఆలయ ద్వారం వద్దే నాలుకను వదిలి.. స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను గమనించిన కొందరు.. ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:శ్మశానాల వద్ద హౌస్ఫుల్ బోర్డులు